Leading News Portal in Telugu

Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చెల్లి



Lishi Ganesh Arrested

Drugs Case Filed on Kushitha Kallapu Sister Lishi Ganesh:పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్ కేసులు అనేకం తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడింగ్ లో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడడం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్. గతంలో కొణిదెల నిహారిక ఉండగా రాడిసన్ బ్లూ అనే హోటల్లో ఉన్న పుడింగ్ పబ్ మీద రైడింగ్ జరిగింది. ఆ సమయంలో కుషిత కళ్ళపు, ఆమె చెల్లి లిషి గణేష్ కళ్ళకు అనే అమ్మాయిలు ఇద్దరు కూడా పోలీసులకు చిక్కడంతో అప్పుడు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే అప్పుడు తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్ళామని కుషిత చెప్పింది. ఆ తర్వాత ఆమె చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.

Hyper Aadi: జనసేనకు 24 సీట్లు.. ఎమోషనల్ అయిన హైపర్ ఆది.. ఆ హక్కు మనకు లేదు..?

ఇక ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె నటించిన బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా ఆమె నటించింది కానీ ఎడిటింగ్ లో ఆమె పాత్రను తొలగించారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ మరోసారి రాడిసన్ గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ రైడ్ జరిగినప్పుడు పోలీసులకు కనిపించింది. ఈ క్రమంలో మొత్తం పది మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారిలో లిషి గణేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక కొన్ని వివరాలు బయటకు వచ్చాయి కానీ వాటిని పోలీసులు ధృవీకరించకుండా నిజమని చెప్పలేని పరిస్థితి.