
మూడో సారి మోడీ ప్రధాని చేయడానికి చేపట్టిన యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర అని అన్నారు బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్. ఇవాళ ఖైరతాబాద్ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాధ్యం అనే దాన్ని సుసాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోడీది అని ఆయన కొనియాడారు. ఆర్టికల్ 360 నీ రద్దు చేసే విషయంలో కేవలం మోడీ ఘనతేనన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్నటువంటి త్రిబుల్ తలక్ నీ రద్దు చేసిన ఘనత కూడా మోడీదేనని, నరేంద్ర మోడీ గొప్ప తనం వల్లే మహిళలకి 33% రేజెర్వేషన్ కల్పించడం సాధ్యం అయ్యిందన్నారు లక్ష్మణ్. రామ జన్మ భూమి లో 500 ఏళ్ల నుండి పోరాటం చేసిన పోరాటానికి మోడీ స్వస్తి చెప్పి మందిరాన్ని నిర్మించాడని, ప్రపంచం మొత్తం రామ మందిరం వైపు చూసేలా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు.
అంతేకాకుండా..’జాతీయ రహదారులు పెరగడానికి దోహదం చేసింది కూడా మోడీ నే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఇంటర్ నేషనల్ రేంజ్ లో అభివృద్ధి చేయడం కోసం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తున్నారు.. మూడు సార్లు గుజరాత్ సీఎం గా కొనసాగిన వ్యక్తి.. చిన్న చిన్న ఎమ్మెల్యే , ఎంపీ లు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి ప్రధాని మోడీ.. గుజరాత్ నీ మోడీ ఎలా డెవలప్ చేశారో.. ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి భూపెంద్ర భాయ్ పాటిల్ కూడా డెవలప్ చేస్తున్నారు.. హైదరాబాద్ ను డెవలప్ చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశాడు.. ఉస్సెన్ సాగర్ ను మంచినీటి సరస్సు గా చేసి కొబ్బరి నీల్లుగా మరుస్తా అని గొప్పలు చెప్పాడు.. మురికి కాలువ గానే వదిలేశాడు.. కాంగ్రెస్ కూడా గతం లో పది సంవత్సారాలు అధికారం లో ఉండి ప్రజలను మోసం చేశారు.. అప్పుడు కాంగ్రెస్ కూడా ఉస్సెన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తాం అంటూ జపాన్ నుండి 370 కోట్లు అప్పు తెచ్చారు.. అది కూడా ప్రజలపై భారం పెంచారు తప్పితే చేసిందేమీ లేదు.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అమలు చేయాలేనీ హామీలతో అధికారం లోకి వచ్చింది..
ఇప్పుడు అమలు చేయడానికి నీళ్ళు నములుతుంది.. నరేంద్ర మోడీ పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి.. రైల్వే స్టేషన్లో చాయి అమ్మిన వ్యక్తి మోడీ.. పేదరికంలో చిన్న గుడిసెలో ఉండి ఆ ఇబ్బంది చూసిన వ్యక్తి ప్రధాని మోడీ.. అందుకే పేదలకు గృహాలు నిర్మించి ఇచ్చిన ప్రధాని మన మోడీ.. చెక్క పొట్టుతో నడిచే పొయ్యి నీ ఊది మోది తల్లి వంట చేస్తూ ఇబ్బంది ఎదుర్కున్న పరిస్థితి చూసిన మోడీ. తన తల్లి పడిన కష్టం ఇంకెవరు పడకూడదని పేదలకు గ్యాస్ సిలిండర్ లు అందేలా చేసింది మోడీనే.. తెలంగాణ కు కేంద్ర ఇచ్చిన నిధులను దారి మళ్లించిన పరిస్థితి బీఆర్ఎస్ది.. ఒక్క అవినీతి మచ్చ లేని మోది కి రాహుల్ గాంధీ కి పోలికా..? బీఅర్ఎస్ కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేసే పార్టీ.. కాంగ్రెస్ పార్టీ కేవలం నెహ్రూ కుటుంబం కోసం పని చేసే పార్టీ.. ఈ రెండు పార్టీలు జోడు దొంగలు.. బీఅర్ఎస్ ది ముగిసిన అధ్యాయం.. మునిగి పోయే పడవ బీఆర్ఎస్.. త్వరలో మునిగి పోయే పడవ కాంగ్రెస్ పార్టీ.. వికసించే కమలం బీజేపీ పార్టీ.. దేశం భాగుపడలంటే బీజేపీతోనే సాధ్యం.. ‘ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.