Leading News Portal in Telugu

Nellore: పార్టీ కోసం ఎన్నో చేశాం.. జిల్లాలో ఒక్క స్థానం కేటాయించకపోవడంపై ఆందోళన



Janassena

నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు.

Mallikarjun Kharge: రాష్ట్రపతికి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!

ఏడాదిన్నర కాలం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కూడా చేపట్టామని మనుక్రాంత్ తెలిపారు. గడపగడపకూ తిరిగామని.. కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకొని పుట్టిన ఊరికి ఏదో మంచి చేయాలని వచ్చానని చెప్పారు. ప్రజలు తమను ఎంతో ఆదరించారని.. నెల్లూరు సిటీ నుంచి జనసేనకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించానని తెలిపారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

Hanuma Vihari: ఆంధ్ర రంజీ జట్టుకు హనుమ విహారి వీడ్కోలు..

నెల్లూరు జిల్లాలో ఒక సీటు కూడా కేటాయించకపోవడంతో నేతలంతా తీవ్ర కలత చెందుతున్నారని మనుక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడి జిల్లాలో ఒక సీటైనా కేటాయించేలా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని.. తాను ఎంత ప్రయత్నించినా పొత్తులో స్థానం పోయిందని తెలిపారు. ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం తాము ఎన్నికల్లో పని చేస్తామని పేర్కొన్నారు.