Leading News Portal in Telugu

Om Bheem Bush Teaser: చేతబడిని కూడా ఇంత కామెడీ చేశారు ఏంటిరా మావా..



Bush

Om Bheem Bush Teaser: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో శ్రీవిష్ణు, ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ ఒక క్రేజీ ఫన్ రైడ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం భీమ్ బుష్ అనే టైటిల్ తో ఈ సినిమా ఒక సరికొత్త కామెడీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే ఈ ట్రియో.. బ్రోచేవారెవరురా సినిమాలో ఎంత కామెడీ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించి కామెడీని పంచనున్నారని ఈ టీజర్ ను బట్టి అర్ధమవుతుంది. తాజాగా ఓం భీమ్ బుష్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం కామెడీతో నిండిపోయింది.

భైరవపురం అనే గ్రామానికి ముగ్గురు సైంటిస్టులు వస్తారు. ఆ ఊరులో ఏదో ఉందని వెతుకుతూ ఉంటారు. వాళ్ళేవారో తెలియని గ్రామ ప్రజలు వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు.. అక్కడ ఉండే గుప్తనిధులు కోసం వచ్చినట్లు చూపించారు. ఇక వాటి కోసం వీరు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఆ గ్రామంలో ఉండే గుహలు, చెట్లు, పుట్టలు, స్మశానాలు అన్ని వెతుకుతారు. చేతబడి చేసిన సామాన్లను కూడా బయటకు తీసి బొమ్మలు అంటూ ఆడుకుంటారు. అసలు ఆ ఊరు లో గుప్తనిధులు ఉన్నాయా.. ? ఈ ముగ్గురు సైంటిస్టులు చివరికి వాటిని కనిపెట్టారా.. ? అనేది సినిమాగా తెలుస్తోంది. ఇక సినిమా మొదటి పోస్టర్ నుంచి ఎంతో ఆసక్తి కలిగించారు. ముందుగానే ఈ సినిమాలో లాజిక్స్ ఉండవని మ్యాజిక్ మాత్రమే చూడమని చెప్పడంతో.. మొత్తం ఎంటర్ టైన్మెంట్ నే ఎక్స్పెక్ట్ చేయాలి అని అర్ధం అయ్యింది. ఇక విష్ణు కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చివర్లో గుప్తనిధులు ఊగిసలాడుతున్నాయి అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మరి ఈ సినిమాతో ఈ ట్రియో రెండోసారి హిట్ కొడతారేమో చూడాలి.