Leading News Portal in Telugu

Congress: నేడు చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రెండు పథకాల అమలుకు శ్రీకారం..



Cong

Telangana Govt: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక, గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్దిని 5 లక్షల నుంచి 10లక్షల రూపాయలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా, ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లైతుంది.

Read Also: ONGC Jobs 2024: ONGCలో కన్సల్టెంట్ పోస్టులు..జీతం ఎంతంటే?

ఇక, తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డు దారులు ఉన్నారు. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. దీంతో వారికి వచ్చే నెల నుంచి జీరో విద్యుత్ బిల్లులు రానున్నాయి. అయితే, ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి మాత్రం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది. మార్చిలో వాడిన కరెంటుకి సంబంధించి, జీరో బిల్లు ఏప్రిల్‌లో రానుంది.

Read Also: YCP: రేపు సీఎం కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్

అలాగే, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ మహాలక్ష్మి పథకం పొందే కుటుంబాలు తెలంగాణలో దాదాపు 40 లక్షల దాకా ఉన్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ కొనేవారు ముందుగా పూర్తి ధర చెల్లించాల్సిందే.. ఆ తర్వాత సబ్సిడీ డబ్బులను వారి అకౌంట్లలో ప్రభుత్వం తిరిగి జమ చేస్తుంది.