Leading News Portal in Telugu

Akshata Murty: సెక్యూరిటీ లేకుండానే.. బెంగళూరు నగర వీధుల్లో బ్రిటన్‌ ప్రథమ మహిళ..



Aksya Murthy

UK First Lady: ఇన్ఫోసిస్ సంస్థ చీఫ్ నారాయ‌ణ‌మూర్తి, సుధామూర్తి కుటుంబం ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థను నడుపుతున్నప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కువ ఆడంబరాలకు వీళ్లు పోరు.. ఇక వీరి కుమార్తె అక్షత మూర్తి సైతం తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తుంది. ఓ దేశానికి ప్రథమ మహిళ అయినప్పటికీ అక్షత కూడా ఎంతో సింపుల్‌గా జీవితం గడుపుతుంది. అయితే, తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనపడ్డారు. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తితో పాటు తన ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి సిటీలోని రాఘవేంద్ర మఠానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ పరిసరాల్లో కలియతిరిగారు. వీరిని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Kotamreddy Sridhar Reddy: అనర్హత వేటుపై స్పందించిన కోటంరెడ్డి.. సాధించింది ఏమీలేదు..!

ఇక, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి, పిల్లలు బెంగళూరులోని రాఘవేంద్ర మఠం దగ్గర కనిపించారు. వారికి ఎలాంటి సెక్యురిటీ లేకుండానే ఉన్నారు. ఇది వారి సింప్లిసిటీకి నిదర్శనంగా నిలుస్తుంది. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ నారాయణమూర్తి ఫ్యామిలీ ఇలా సాధారణ పౌరుల లాగా రోడ్లపై తిరుగుతుండటంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, అక్షత మూర్తి ఇటీవలే తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులో ఐస్‌క్రీమ్‌ పార్లల్‌కు వెళ్లింది. కార్నర్ హౌజ్ హోటల్‌లో ఇద్దరూ ఐస్‌క్రీమ్ తింటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధార‌ణ దుస్తుల్లో ఉన్న ఇద్దరూ.. న‌వ్వుతూ ఉన్న ఫొటోలు అప్పట్లో నెట్టింట హల్ చల్ చేశాయి.