
డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అందులో వాల్‌నట్స్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాల్‌నట్స్‌లో చాలా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్‌నట్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.. రోజూ తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాల్ నట్స్ తీసుకోవాలి. పొటాషియం, జింక్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు నిండుగా ఉండే వాల్‌నట్‌లు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది..
రోజుకు రెండు చొప్పున తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.. రోజుకు 3 నుండి 4 వాల్‌నట్స్ తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
బరువు తగ్గాలని అనుకొనేవారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెబుతున్నారు.. ఉదయాన్నే వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. వాల్ నట్స్ లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ధమనులలో కొవ్వు ను పేరుకు పోకుండా కరిగించడంలో సహాయ పడుతుంది..
ఎముకలు దృఢంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఇది చాలా మేలు చేస్తాయి.. క్యాన్సర్ నుండి రక్షించడమే కాదు.. మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.