
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్రంప్ వయసును గూర్చి వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కూడా తప్పులు చేస్తున్నారని.. ఈ సందర్భంగా ట్రంప్ సతీమణి అంశాన్ని లేవనెత్తారు. ఆమె వేరే పేరుతో పలుస్తారంటూ వచ్చిన అంశాన్ని బైడెన్ ప్రస్తావించారు.
ట్రంప్ తన భార్య పేరును కూడా గుర్తుంచుకోలేరని బైడెన్ విమర్శలు చేశారు. అలాగే ఆయన ఆలోచనలన్నీ కాలం చెల్లినవని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా..? లేక తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా..? అనే దానిపై స్పష్టత లేదన్నారు