Leading News Portal in Telugu

Tummala Nageswara Rao : రాష్ట్రంలో వ్యవసాయ కాలేజీలు, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జిల్లాకు ఒకటి



Tummala

రాష్ట్రములో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం, రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా, సాగుకు అనుకూల విస్తీర్ణాన్ని అంచనవేసి, 14 కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసుకొని ముందుకు సాగుతున్నది. ముందుగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చూసుకొన్నట్లయితే కొన్ని కంపెనీలు ఇంకా వాటి లక్ష్యములో 20 కూడా సాధించక పోవడం పట్ల, మంత్రి వర్యులు తీవ్రంగా పరిగణించడం జరిగింది.

రానున్న కాలములో ఇదేవిధముగా వారి ప్రగతి ఆశించస్థాయిలోనే లేకపోతే వారితో చేసుకున్న ఒప్పందాలను పునః సమీక్షించి, కఠిన నిర్ణయాలు తీసుకోవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఇప్పటికీ 1,52,957 ఎకరాలు మాత్రమే ప్లాంటేషన్ పూర్తి అయ్యిందని, మిగతా లక్ష్యమునకు చేరే విధంగా ఆయా కంపెనీలు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వడమైనది. అధే విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణాలు కొరకు స్థలసేకరణ , నిర్మాణము కూడా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసే విధంగా చూడాలని కోరడమైనది.

విత్తన క్షేత్రాలు, ఉద్యాన క్షేత్రాలు

వ్యవసాయ శాఖ 9 జిల్లాలలో విత్తన క్షేత్రాలను నిర్వహిస్తున్నదని దాదాపు 1457 ఎకరాలు విస్తీర్ణము ఆయా విత్తన క్షేత్రాల పరిధిలో ఉందని, ఇందులో అక్కడి స్థితిగతుల, నీటి వసతి దృష్ట్యా వరి, కంది విత్తన ఉత్పత్తి వానకాలములో, వరి, శనగ, మినుము, పెసర విత్తనోత్పత్తి యాసంగిలో చేపట్టి, తద్వారా వచ్చిన విత్తనాన్ని విత్తనోత్పత్తి పధకం ద్వారా లేదా స్టేట్ సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నయని అధికారులు తెలియజేసారు.

విత్తనక్షేత్రాలను మరింత సమర్ధవంతముగా నిర్వహించి, అధిక విత్తనోత్పత్తి సాధించి రాష్ట్రములో రైతులను నాణ్యమైన విత్తనాన్ని అందించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా వీటి పరిరక్షణకు తగిన ప్రతిపాదనలు సిద్దంచేయగలరని వారిని కోరారు విత్తన క్షేత్రాలు బొప్పా సపల్లిలో (కామారెడ్డి), మాల్తుమేద (కామారెడ్డి), సదాశివపేట (సంగారెడ్డి), కురవిపాడు జులేకల్ (జోగులాంబ గద్వాల), దండి , చెరుకుపల్లి (నల్గొండ జిల్లాలో) కడెం (నిర్మల్), జిల్లాలో కలవు.

అధే విధంగా గరిమేళ్ళపాడు, అశ్వరావుపేట, అచ్యుతపురం, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), రుక్మపూర్ (కరీంనగర్ జిల్లా ), పిల్లలమర్రి (మహబూబ్ నగర్ జిల్లా), అధిలాబాద్ (అధిలాబాద్ జిల్లా), గుడిపేట, కన్నాల్ (మoచిర్యాల జిల్లా), మాల్తుమేద (కామారెడ్డి), వికారాబాద్ – వికారాబాద్, ముద్గల్ (నిర్మల్), వికారాబాద్(వికారాబాద్), చేగొమ్మ – ఖమ్మం, ఘన్ పూర్ – మెదక్ జిల్లా, మొత్తం 13 క్షేత్రాలు ఉద్యాన శాఖలో పరిధిలో నిర్వహించబడుచున్నవి అధే విధంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ , పండ్లకు సంబంధిoచి ములుగులో, కూరగాయలు, పూలతోటలకు సంబంధిoచి జీడీమెట్లలో నిర్వహిస్తున్నామని వీటిద్వారా రైతులకు నాణ్యమైన మొక్కలు, అంటు అందిస్తున్నామని తెలియజేసారు. దీనికి సంబంధిoచి మంత్రివర్యులు మాట్లాడుతూ, ఇవి కేవలం విత్తన సరఫరాకే పరిమితo కాకుండా రైతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందించే క్షేత్రాలుగా కూడా వృద్ది చేయడానికి ప్రణాళికలు చేయాల్సిందిగా ఆదేశించారు.

రాష్ట్రములో వ్యవసాయ కాలేజీలు : – 8 వ్యవసాయ కాలేజీలు, 2 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు,ప్రస్తుతము రాష్ట్రములో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, అధికారులు తెలుపగ, వ్యవసాయ కోర్సుకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఉమ్మడి జిల్లాకు ఒక కాలేజీ ఉండే విధంగా ప్రణాళికా సిద్దం చేయాలని కోరారు. ప్రస్తుతం నల్గొండ , నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయ కాలేజీ అందుబాటులో లేదని దీనికి సంబంధించి, నిజామాబాద్ రుద్రూర్, నల్గొండలో కంపసాగర్ లో వ్యవసాయ కాలేజీలకు ప్రతిపాదనలు సిద్దంచేయాలని కోరారు.

దావోస్ లో వ్యవసాయ రంగములో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతి:- గోద్రెజ్ కంపెనీ సేమీడార్బి మలేషియా వారి భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లాలో కొణిజెర్ల మండలము గబ్బగుర్తి గ్రామములో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ కు, స్థల సేకరణ జరుగుతుందని అక్కడ సీడ్ గార్డెన్ ఏర్పాటును త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.