Leading News Portal in Telugu

AP News: విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు..



Notice

ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.

Read Also: TDP: చంద్రబాబును కలిసిన వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు..

రూ. 3 లక్షల మేర విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని పేర్కోంటూ జీఏడీ లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఏపీ సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఏపీ ఎన్జీజీవో సంఘాల అధ్యక్షులకు లేఖ జీఏడీ రాసింది. ఏయే ప్లాట్లల్లో అదనంగా విద్యుత్ వినియోగం జరిగిందోననే వివరాలను అడ్రస్సులతో సహా లేఖలో ప్రస్తావించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా జీఏడీ ఉద్యోగులను కోరింది.

Read Also: TDP-Janasena: తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సభ..