
ఆర్మీ క్యాంటీన్‌లో పని చేస్తున్న విక్రమ్ సింగ్ అనే కార్మికుడికి పాకిస్థాన్ యువతి వలపు వల విసిరింది. ఈ మాయలో చిక్కుకున్న యువకుడు సమాచారాన్ని లీక్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆర్మీ క్యాంటీన్‌లో (Rajasthan Army Canteen) చోటుచేసుకుంది.
విక్రమ్ సింగ్ హనీట్రాప్‌లో పడిపోయాడని పోలీసులు గుర్తించారు. సామాజిక మీడియా ద్వారా ఆమె వలపు వల విసిరింది. పాకిస్తాన్ మహిళా ఏజెంట్లతో వ్యూహాత్మకంగా ముఖ్యమైన సమాచారాన్ని విక్రమ్ పంచుకుంటున్నాడని రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం తెలిపింది.
ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసినట్లుగా విక్రమ్ సింగ్‌పై పోలీసులు అభియోగాలు మోపారు.
విక్రమ్ సింగ్ పాకిస్తాన్ మహిళా ఏజెంట్లతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటూ హనీట్రాప్‌కు గురయ్యాడు.
విక్రమ్ సింగ్ (31) బికనీర్‌లోని దుంగార్‌ఘర్ నివాసి. బికనీర్‌లోని మహాజన్ ప్రాంతంలో ఆర్మీ క్యాంటీన్‌ను చాలా కాలంగా నిర్వహిస్తున్నాడు.
ఈ ప్రాంతంలో ఐఎస్‌ఐ కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు పోలీసు ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఈ నిఘా ఆపరేషన్‌లో విక్రమ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హ్యాండ్లర్‌లతో నిరంతరం కమ్యూనికేషన్‌ను నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. విక్రమ్ సింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్న నిఘా బృందం అతను హనీట్రాప్‌లో పడిపోయినట్లు గుర్తించారు.
ఐఎస్ఐతో సంబంధం ఉన్న అనిత అనే మహిళతో విక్రమ్‌కు ఏడాది క్రితం పరిచయం ఏర్పడిందని అగర్వాల్ తెలిపారు. ఈ పాకిస్థానీ ఏజెంట్ ఆదేశానుసారం.. విక్రమ్ ఆర్మీ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లు, లొకేషన్‌లు, నిషేధిత ప్రాంతాల వీడియోలు, అలాగే యూనిట్‌లు మరియు అధికారుల గురించిన వివరాలతో సహా సోషల్ మీడియా ద్వారా సున్నితమైన సమాచారాన్ని అందించినట్లుగా గుర్తించారు.