Leading News Portal in Telugu

Rana goswami: కాంగ్రెస్‌కు మరో షాక్.. అసోం కీలక నేత రాజీనామా



Rana

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్ రాజీనామా చేసి బీజేపీకి గూటికి చేరిపోయారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా కమలం గూటికి చేరుతారని ప్రచారం జరిగినా ఆయన కొట్టిపారేశారు. కానీ తాజాగా మరో కీలక నేత హస్తం పార్టీని వీడారు. అసోం వర్కింగ్ ప్రెసిడెంట్, జోర్హాట్ మాజీ ఎమ్మెల్యే రాణా గోస్వామి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి రిజైన్ లెటర్ పంపించారు. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.