
Gaami: Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నాడు.అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా విశ్వక్ కనిపించనున్నట్లు సమాచారం. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గామి ట్రైలర్ లాంచ్ ముహూర్తం ఖరారు చేశారు.
ఇక అన్ని ట్రైలర్స్ లా కాకుండా ఈ ట్రైలర్ ను సరికొత్త ఫార్మాట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. గామి షోరీల్ ట్రైలర్ పీసీఎక్స్ ఫార్మాట్లో విడుదల అవుతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. ప్రసాద్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సందీప్ ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్న విషయం తెల్సిందే. అనిమల్ సినిమా రిలీజ్ దగ్గరనుంచి సందీప్ ఇంటర్వ్యూ, వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు విశ్వక్ ఈవెంట్ కు సందీప్ వస్తే.. కొంత హైప్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అందుకే విశ్వక్.. ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఈవెంట్ లో ఒరిజినల్ అనిమల్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.
MONSTROUS DIRECTOR @imvangasandeep will be gracing the #GaamiShowreelTrailer Launch event tomorrow
Prasads Multiplex, Hyd from 4 PM onwards
Ba at the event dressed in black to experience #Gaami magic
Stay tuned!
https://t.co/cNbpNRvxmw
Grand release worldwide on… pic.twitter.com/vTYO0b82O3
— UV Creations (@UV_Creations) February 28, 2024