
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు ‘ప్రజాగళం’ కార్యక్రమం చేపట్టనున్నారు. మొదటిరోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరులో ‘ప్రజాగళం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మార్చి 4న రాప్తాడు సభతో చంద్రబాబు రా కదలిరా సభలు ముగియనున్నాయి. అనంతరం ‘ప్రజాగళం’ పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి రానున్నారు.