Leading News Portal in Telugu

PM-KISAN: పీఎం కిసాన్‌పై కేంద్రం కీలక ప్రకటన



Mdoie

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలోకి కొత్తగా 90 లక్షల మంది లబ్ధి పొందినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలోకి (PM-KISAN scheme) 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గతేడాది నవంబర్‌ 15న వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌యాత్రకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్రం తెలిపింది.

2019 ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఏటా రూ.6వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 16వ విడత నిధులను ప్రధాని మోడీ ఇటీవల విడుదల చేశారు. 11 కోట్ల మంది ఖాతాల్లో ఈ నగదు జమైంది. పథకం ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల నగదు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇకపోతే ఈ కిసాన్ మిత్ర ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, ఒడియా, తమిళం, బంగ్లా, మలయాళం, గుజరాతీ, పంజాబీ, తెలుగు, మరాఠీ వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది.