Leading News Portal in Telugu

Gaami: గామి అంటే అర్ధం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్



Gami

Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్‌, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు.మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన చాందిని చౌదరి నటించింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి అస్సలు గామి అంటే ఏంటి.. ? దాని అర్ధం ఏంటి.. ? అర్థంపర్థం లేని టైటిల్ గా అనిపిస్తుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. తాజాగా ట్రైలర్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ మొత్తానికి డైరెక్టర్ విద్యాధర్ కగిత క్లారిటీ ఇచ్చాడు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విద్యాధర్ కగిత మాట్లాడుతూ.. ” చిన్నగా మొదలై పెద్ద సినిమా అయ్యింది గామి. వంశీ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా ఫ్రీడం ఇచ్చారు. సందీప్ అన్న చాలా హెల్ప్ చేశారు. గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది. గామి అనే ఏంటి అంటే.. గామి అంటే సీకర్.. గమ్యాన్ని గమించేవాడు గామి. మీనింగ్ ఉంది దానికి. అతనికి మానవ స్పర్శే పెద్ద భయం.. అదే అతనికి కోరిక కూడా మానవ స్పర్శనే.. ఇంతకన్నా ఈ స్టేజిమీద ఎక్కువ చెప్పలేను. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాం. దాని కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8న కొత్తరం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.