Leading News Portal in Telugu

Radisson Drugs Case: డ్రగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. పెరుగుతున్న నిందితుల సంఖ్య



Radisson Drugs Case

Radisson Drugs Case: రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు తన స్టేట్ మెంట్ ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల ముందుకు వస్తానని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. షూటింగ్ బిజీలో ఉన్నందున ఇప్పటి వరకు రాలేకపోయానని దర్యాప్తు అధికారులకు చెప్పారు. ఈ రోజైన గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరవుతాడా? లేదా? అనేదాని పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో శ్వేత, లిసి, నీల్, సందీప్ లు పరారీలో వున్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేసారు. డ్రగ్స్ సరఫరా గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీ అరెస్టు చేశారు అధికారులు. అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ అదుపులో తీసుకున్నారు. మిర్జా వాహిద్ డ్రగ్స ఎక్కడి నుండి తెస్తున్నాడో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. మిర్జా వాహిద్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 14 మందిని నిందితులుగా పోలీసులు చేర్చడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది.

Read also: BRS KTR: రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి..? కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన, డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నారని అన్నారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపాడు. వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించాడు. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని తెలిపాడు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్ ను పోలీసులు గుర్తించారు.
Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు