Leading News Portal in Telugu

USA: పుతిన్ అణు వ్యాఖ్యలపై అమెరికా ఫైర్



Pitin

రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గిరాజేశాయి. తాజాగా పుతిన్ చేసిన అణు వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది.

ఉక్రెయిన్‌ (Ukraine) యుద్ధంలో పశ్చిమ దేశాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటే.. అది అణు సంక్షోభానికి దారితీస్తుందని రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Putin) చేసిన హెచ్చరికలను అమెరికా (America) ఖండించింది.

పుతిన్ తీరును అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్రంగా తప్పుపట్టారు. అణ్వాయుధ దేశాధినేత ఇలా మాట్లాడటం సరికాదని చెప్పారు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పటికే పలుమార్లు రష్యాకు వెల్లడించామని తెలిపారు.

త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పుతిన్ ప్రజలనుద్దేశించి అణు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వారి భూభాగాల్లోని లక్ష్యాలనూ ఛేదించగల ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భగా పుతిన్ అణు హెచ్చరిక చేశారు.