బీఆర్ఎస్ చలో మేడిగడ్డపై కాంగ్రెస్ చలోక్తులు | congress criticize brs chaloo medigadda| corruption| wrong| design| cag| national| dam| safety
posted on Mar 1, 2024 11:18AM
లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ మేడిగడ్డ పేరు చెప్పి బీఆర్ఎస్ తో ఓ ఆటాడుకుంటోంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుపై చలోక్తులు విసురుతోంది. కల్వకుంట్ల కనస్ట్రక్షన్స్ మేడిగడ్డ అన్న టైటిల్ తో రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కు బలే మేసినవ్ బిడ్డా అంటూ ట్యాగ్ లైన్ పెట్టి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటును అదేమంత పెద్ద విషయం కాదంటూ కవరింగ్ ఇచ్చుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను సెటైర్లతో ఎద్దేవా చేస్తూ ఓ ఆటాడుకుంటోంది.
కేటీఆర్ చలో మేడిగడ్డ పిలుపుపై సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన పోస్టర్ లో కాంగ్రెస్ మేత మేసిన మేడిపండ్లన్నీ మేడిగడ్డకు బయల్దేరాయ్ అంటూ ఎకసెక్కాలాడింది.
మేడిగడ్డ లోపాలను బయటపెట్టిన కాగ్, నేషనల్ సేఫ్టీ అథారిటీల నివేదికలను ఉటంకిస్తూ బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. కాగ్ కు ఏం తెలుసు కాకరకాయ్, నేషనల్ సేష్టి అథారిటీకేం తెలుసు అరటికాయ్ అంటూ అసలు విషయాలన్నీ బీఆర్ఎస్ బిల్డప్ బాబాయ్ లకే తెలుసు, ఎందుకంటే వాళ్ల అధినేత 80 వేల పుస్తకాలు చదివి మరీ ఇంజనీర్లను పక్కన పెట్టి డిజైన్ చేశారంటూ సెటైర్లు గుప్పించింది.
ఇక ఇప్పుడు ఆ అజ్ణానంతో లోపాలు సహజమే అని సమర్ధించుకోవడానికి బయలు దేరారంటూ విమర్శలు గుప్పించింది. నిజంగా మేడి గడ్డ బ్రహ్మాండంగా ఉంటే అప్పుడే ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పుడు దొంగల్లా మేడిగడ్డకు వచ్చి పోవడం ఎందుకని ప్రశ్నించింది.