
ప్రధాని మోడీ (PM Modi) ఇటీవల అబుదాబిలో (Abu Dhabi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం (Hindu Temple) దగ్గర సందడి మొదలైంది. మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం ఆలయ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తొలి హిందూ దేవాలయాన్ని సందర్శించి తరించారు.
ఫిబ్రవరి 14న అబుదాబిలోని తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. గత 15 నుంచి 29 వరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఐపీలకు అనుమతి ఇచ్చారు. మార్చి 1 నుంచి మాత్రం ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. దీంతో తొలి రోజే పెద్ద ఎత్తున ప్రజలు సందర్శించారు. సోమవారం మాత్రం ఆలయం మూసివేయనున్నట్లు అధికారుల తెలిపారు.
యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే. అక్కడ ప్రభుత్వం ఇచ్చిన భూములో పాలరాతితో నిర్మించారు. భారత్ నుంచి వెళ్లిన ప్రత్యేక కళాకారులు దీన్ని నిర్మించారు.
#WATCH | Abu Dhabi (UAE): BAPS Hindu Temple inaugurated by PM Narendra Modi, today opens for the general public. pic.twitter.com/UoNZmIIPTP
— ANI (@ANI) March 1, 2024