Leading News Portal in Telugu

Udhayanidhi Stalin vs Annamalai: మీరు డీఎంకేని టచ్ చేయలేరు.. నువ్వో విఫల నటుడివి..



Udhayanidhi Stalin Vs Annamalai

Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28 పైసా మోడీ’ అంటై ప్రధానిని విమర్శించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్న షెహబాజ్ షరీఫ్..

రాష్ట్రంలో తమ డీఎంకే పార్టీని బీజేపీ ముట్టుకోలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుపొందలేదని ఛాలెంజ్ చేశారు. తమిళనాడు చుట్టూ తిరుగుతున్న మోడీ, ఎప్పుడూ చూసినా అబద్దాలు చెబుతున్నారని, డీఎంకేని నాశనం చేస్తానమని గత 60-70 ఏళ్లుగా చెబుతున్నారని, ప్రధాని మాత్రమే కాదు మీ తాత వచ్చినా డీఎంకేని టచ్ చేయలేరని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. వరదలు, తుఫానుల సమయంలో ప్రధాని తమిళనాడుకు రారని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని ఎద్దేవా చేశారు.

ప్రధానిపై విమర్శలకు గానూ ఉదయనిధిపై అన్నామలై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ ‘విఫలమైన నటుడు’ అని పిలిచారు.తండ్రి, తాత పేర్లతో రాజకీయాల్లో నిలదొక్కుకుని మంత్రి అయ్యారని, ప్రధాని కాలి గోరుకు ఉన్న మురికి కూడా ఆయన సమానం కాదని, తన కుటుంబ పేరుతో రాజకీయాల్లోకి వచ్చాడని, అతను ఏదైనా సామాజిక సేవ చేశాడా.?? అని ప్రశ్నించారు. స్టాలిన్, కరుణానిధి అనే పేర్లు లేకుంటే ఆయన ఎవరని అన్నామలై ప్రశ్నించారు.