
Chandrababu: రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలు, వ్యాపారం కాకుండా.. సేవ కోసం వేమిరెడ్డి వచ్చారని.. నెల్లూరులో వైసీపీ అంతా ఖాళీ అవుతోందన్నారు. నెల్లూరు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారన్నారు. సాధారణంగా ఎవరైనా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ లేదా అమరావతికి వస్తారని.. కానీ నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే అదే వారికి ఇచ్చిన ప్రత్యేకత అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నెల్లూరు రాజకీయ నాయకులు ఆత్మాభిమానంతో ఉంటారన్నారు.
Read Also: Vijayasai Reddy: 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా మేదరమెట్ల ‘సిద్ధం’ మహాసభ
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజలను బానిసలుగా జగన్ భావిస్తున్నారు. చేసిన తప్పులు ఎత్తి చూపితే జగన్ తట్టుకోలేరు అందుకే ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిలు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. టీడీపీలో వ్యక్తులను గౌరవిస్తాం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలి. జగన్ విధానాలు నచ్చక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బయటకు వస్తున్నారు. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. జగన్ మాటలు అన్నీ బూటకమే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత విశాఖను దోచిన వ్యక్తిని నెల్లూరుకి పంపుతున్నారు. ఆయనను నెల్లూరు ప్రజలు తిరుగు టపాలో పంపుతారు.” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Mudragada Padmanabham: ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!
నెల్లూరులో ఒక నేత ఎగిరి ఎగిరి పడ్డారని.. ఆయన మంత్రిగా ఉన్నపుడు ఒంటి మీద బట్టలు కూడా సరిగా వేసుకోడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. వై నాట్ కుప్పం అన్నారని.. తాము వై నాట్ పులివెందుల అంటున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఎంతో బాధ కలుగుతోందన్నారు. ఒక్క చాన్స్ పేరుతో వచ్చి అన్ని వర్గాల ప్రజలనూ జగన్ ఇబ్బంది పెడుతున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “ఉద్యోగులు జీతాలు పెంచమని అడగడం లేదు. జీతం వస్తే చాలను కుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలిపించాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశా. వేమిరెడ్డిపై కూడా సర్వే చేస్తే చక్కటి స్పందన వచ్చింది. జనసేన-టీడీపీలు 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తే వైసీపీలో వణుకు పుడుతోంది.” అని అన్నారు.