
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే అని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. నేను ఉద్యమాలు చేసి వచ్చానని, నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ చురకలు అంటించారు.
Nitish Kumar: “ప్రధాని మోడీని ఇక విడిచి పోయేది లేదు”..ఎన్డీయేతోనే ఉంటానన్న సీఎం నితీష్ కుమార్..
ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీ లోకి పోతాడని, కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదంటూ ఆయన ప్రశ్నలు వర్షం కురిపించారు. కాళేశ్వరం పనికిరాదని NDSA రిపోర్ట్ ఇచ్చిందని, ప్రజలే కేసీఆర్ నీ నామరూపాలు లేకుండా చేశారన్నారు. ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందని, భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పానని ఆయన వెల్లడించారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో సౌత్ ఇండియాలో టాప్ మెజార్టీ వస్తుందని, మోడీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Anant Ambani: కుమారుడి మాటలకు ముకేశ్ అంబానీ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి