Leading News Portal in Telugu

CM Revanth Reddy : పేదలకు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం



Revanth Reddy Cm

ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల లబ్దిదారుల వివరాలు ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ శాఖ అధికారులు అందజేశారు.

Ashwini Vaishnaw: రాబోయే కాలంలో 1000కి పైగా అమృత్ భారత్ రైళ్లు.. గంటకు 250 కి.మీతో నడిచే రైళ్ల తయారీ..

ఈ సమీక్ష అనంతరం.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tummala Nageswara Rao : రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగు