Leading News Portal in Telugu

RK.Roja: మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే అసమ్మతి.. ఓడిస్తామని ప్రకటన



Roja

మంత్రి రోజాకు (RK.Roja) సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ రోజాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు. తిరుపతిలో వ్యతిరేక వర్గం మీడియా సమావేశం నిర్వహించారు.

వడమాల పేట వైసీపీ జెడ్పిటీసీ మురళి ధర్ రెడ్డి, పుత్తూరు నేతలు, శ్రీశైలం ఆలయ చైర్మన్ తమ్ముడు, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కూడా రోజా, అమె సోదరులు లాగా దోచుకోలేదన్నారు. రోజాను గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలన్నారు. వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవానికి జనాలు లేకపోవడంతో ఓపెన్ చేయకుండా రోజా తిరిగి వెళ్లిపోయారన్నారు. టీడీపీ అభ్యర్ధి భాను ప్రకాష్‌ను గెలిపించాలనే ఉద్దేశంతోనే నగరి వైసీపీ నేతలు రోజాకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు.

రోజాకు కాకుండా సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రోజా తమకు పదవులు ఇవ్వడమేంటి? మాకు పదవులు ఇచ్చింది వైపీపీ పార్టీ అని తెలిపారు. తామంతా కష్టపడి పనిచేయడం వల్లే రోజా గెలిచిందన్నారు. రోజా ఒత్తిడితో అధికారులు, పోలీసులు వచ్చి బలవంతంగా శిలాఫలకాలను ఎత్తికెళ్లారని వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు.