Leading News Portal in Telugu

NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!



Nathan Lyon Test

Nathan Lyon Creates History in WTC: వెల్లింగ్‌ట‌న్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసీస్ విజయంలో స్పిన్నర్‌ నాథన్ లియోన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో లియోన్ 10 వికెట్స్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్స్ పడగొట్టిన లియోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి కివీస్‌ పతనాన్ని శాసించాడు. సంచలన ప్రదర్శన చేసిన లియోన్‌.. ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్‌ లియోన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 10 సార్లు 5 వికెట్ల హాల్‌ లియోన్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, లియోన్ పేరిట సంయుక్తంగా ఉండేది. యాష్ 9 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్‌ రికార్డును లియోన్‌ బ్రేక్‌ చేశాడు. ఇటీవలి కాలంలో లియోన్‌ మంచి ఫామ్ మీదున్న విషయం తెలిసిందే.

Also Read: Road Accident : ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి సీరియస్

నాలుగో రోజు 111/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను నాథన్‌ లియోన్ దెబ్బ‌కొట్టాడు. స్టార్ బ్యాటర్లు ర‌చిన్ ర‌వీంద్ర‌ (56), టామ్ బ్లండెల్ (0), గ్లెన్ ఫిలిఫ్స్‌ (1)ల‌ను ఔట్ చేసి ఆస్ట్రేలియాను విజయం వైపు నడిపాడు. టీమ్ సౌథీ (7) సహా టామ్ లాథమ్ (8), కేన్ విలియమ్సన్ (9)లను పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ చివరలో స్కాట్ క‌గ్గెలెజీన్ (26), మ్యాట్ హెన్రీ (14)లు కాసేపు పోరాడినా.. గ్రీన్, హేజిల్‌వుడ్ ఈ ఇద్ద‌రినీ ఔట్ చేసి కివీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. సెంచ‌రీ హీరో కామెరూన్ గ్రీన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.