Leading News Portal in Telugu

Ponnam Prabhakar: పిల్లలకి పోలియో చుక్కలను వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..



Ponnam Prabhakar

Ponnam Prabhakar: పిల్లలకి పోలియో చుక్కలను వేసి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చింతల్ బస్తీ UPHC లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పొన్నం ప్రారంభిచారు. భారత దేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వం 27 వ సారి పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రజల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఈరోజు పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర కార్యక్రమం వల్లే అన్నారు. హైదరాబాద్ లో 2007 తరువాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. దేశంలో 2011 తరువాత ఒక పోలియో కేసు కూడా రాలేదన్నారు. 2012 లో భారత దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించ బడిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 2800 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Read also: Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి

బస్ స్టాప్ లలో, హాస్పిటల్ లు, 85 ట్రాన్సిట్ పాయింట్స్ ,123 మొబైల్ బృందాల ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు ఈనెల 4,5,6 తేదీల్లో 11 వేల మంది సిబ్బంది హైదరాబాద్ లో ఇంటింటికీ తిరుగుతున్నారని తెలిపారు. సరోజినీ, నిలోఫర్, ఎంజీఎం హాస్పిటల్ లు డెవలప్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. త్వరలోనే ఆ హాస్పిటల్ లని సందర్శిస్తా అన్నారు. సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యేలా చూస్తా అన్నారు. మా ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నిటి కంటే మహా భాగ్యమన్నారు. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Hyderabad Kidnapping Case: కిడ్నాప్‌ కు గురైన పాప సేఫ్‌.. ఎక్కడ గుర్తించారంటే..