Leading News Portal in Telugu

Vishwak Sen: ఆరేళ్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..



Vish

Vishwak Sen: ఇప్పుడున్న ఇండస్ట్రీలో విలువలు తక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు.. ఒక సినిమా పోతే.. ఇంకో సినిమాను ఆ నిర్మాతతో ఫ్రీగా చేసేవారు.. కొంతమంది రెమ్యూనిరేషన్ తీసుకొనేవారు కూడా కాదు అని చెప్పుకొస్తుంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వారు లేరు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. తరువాతి సినిమాకుఅంతకు మించి ఎక్కువ అడుగుతారు. సినిమా చేసే టైమ్ లో అనుకున్నంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా..సినిమా భారీ హిట్ అయితే.. ఇంకొంత డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. కానీ, ఆరేళ్ళు సినిమా చేసినా.. ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదట ఒక యంగ్ హీరో. ఏంటి .. నిజమా..? ఎవరా హీరో అంటే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్. హీరోగా, డైరెక్టర్ గావిభిన్నమైన కథలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విశ్వక్ నటించిన తాజా చిత్రం గామి.

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2018 లో గామి సెట్స్ మీదకు వెళ్ళింది. అప్పటికీ విశ్వక్.. కుర్ర హీరోనే కానీ అంత స్టార్ డమ్ తెచ్చుకోలేదు. 2023 కు ఈ సినిమా పూర్తీ అయ్యింది. మధ్యలో విశ్వక్ కు హిట్స్ పడ్డాయి. స్టార్ హీరోగా మారాడు. అయినా కూడా గామి సెట్స్ కు ఎప్పుడు స్టార్ హోదాతో వెళ్లలేదట. “ఈ సినిమాకు నేను ఫండ్ ఇచ్చింది అంటే నేను రెమ్యూనిరేషన్ తీసుకోకపోవడమే. ఈ ఆరేళ్ళు.. గామి సెట్ లో మొదటిరోజు ఎలా ఉన్నానో.. ఆరునెలల క్రితం జరిగిన షూటింగ్ లో కూడా అలాగే ఉన్నాను. ఆరేళ్ళు.. రూ. 25లక్షల పెట్టుబడి.. సినిమాను ఎలాగైనా పూర్తిచేశాం. మార్చి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.