Leading News Portal in Telugu

Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు



Summer Heat

Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఐదు రోజుల క్రితం 33.6 డిగ్రీలు ఉన్న ఎండ.. ప్రస్తుతం ప్రతిరోజూ 35 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండటంతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also: Vizag: విశాఖలో గంజాయి కంటైనర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

విజయవాడలో నేడు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు.