
Burra Venkatesham: యాంటి డ్రగ్ కమిటి స్కూళ్ళలలో పెట్టాలి, కాని కమిటి పేరులో డ్రగ్ అనేది రాకుండా చూడాలని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి బుర్ర వెంకటేశం అన్నారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సెమినార్ ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో.. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా స్టాండెర్డ్స్ ఒకే విధంగా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో 100 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఆ.. సమయానికి మన దేశాన్ని ఎలా అభివృద్ధిలో పెడతామనేది ముఖ్యం అన్నారు.
Read also: Bhatti Vikramarka: గుడ్ న్యూస్.. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలు..
ఫిన్లాండ్, సౌత్ కొరియాలలో నే ప్రపంచంలో కెల్లా అత్యంత ఉత్తమమైన ప్రైమరి విద్యా వ్యవస్థ ఉందన్నారు. దేశం బాగుపడాలంటే.విద్యా, ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రేమ ఎక్కువైన, తక్కువైన ఇలా చెడు వ్యసనాల బారిన పిల్లలు పడుతున్నారని తెలిపారు. గతంలో పేరెంట్స్ చెబితే పిల్లలు వినేవాళ్ళు, కాని ఇప్పుడు పిల్లలు చెబుతుంటే పేరెంట్స్ వింటున్నారని అన్నారు. యాంటి డ్రగ్ కమిటి స్కూళ్ళలలో పెట్టాలి, కాని కమిటి పేరులో డ్రగ్ అనేది రాకుండా చూడాలన్నారు. కమిటీలను ప్రతి ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే వారి గుర్తింపు ప్రక్రియలో ఇబ్బందులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. విలువలు, సాంప్రదాయాలు, టెక్నాలజీలో తెలంగాణా గుర్తింపు ఉండాలన్నారు. ప్రైవేటు స్కూల్ ఉన్న కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ లకు కారణమవుతున్నారని తెలిపారు. గర్ల్స్ సెక్యూరిటి పై జాగ్రత్తగా ఉండాలన్నారు.
BRS MLA Meet CM Revanth: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేభేటీ..! షాక్ ఇస్తారా..?