
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అంబారి- ఆదిలాబాద్ – పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టును 04 మార్చి, 2024న ఆదిలాబాద్‌లో జాతికి అంకితం చేయనున్నారు. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి మధ్య విద్యుద్దీకరణ ముద్ఖేడ్ – పింపల్ కుట్టి విద్యుద్దీకరణ పనుల ప్రాజెక్ట్ లో భాగం. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి సెక్షన్‌లోని 58 రూట్ కిమీ (71 ట్రాక్ కిమీలు) సుమారు రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో విద్యుద్దీకరించబడింది. ఈ రైల్వే లైన్ విభాగం తెలంగాణలోని ఆదిలాబాద్ ( 46.6 రూట్ కిమీ)లోని వెనుకబడిన జిల్లాలు మహారాష్ట్రలోని నాందేడ్ యవత్మాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో (11.5 రూట్ కిమీ) విస్తరించిఉంది .
ఈ ముఖ్యమైన విభాగం సికింద్రాబాద్‌ను నాగ్‌పూర్ వైపు ( నిజామాబాద్ మీదుగా ) ఆ తర్వాత కలిపే రైల్వే లైన్‌లో వస్తుంది. ఈ రైలు మార్గ విద్యుద్దీకరణ వలన ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ / సికింద్రాబాద్ మరియు బెంగళూరు వైపు దక్షిణాన అలాగే నాగ్‌పూర్ మరియు ఆ తర్వాత ఉత్తర భారత దేశం వైపు విద్యుద్దీకరించబడిన నిరంతర రైలు అనుసంధానం కలిగిస్తుంది. ఇది ఇంజిన్ మార్పిడి అవసరం లేకుండా పోవడం వలన రైళ్ల నిలుపుదల సమయంలో ఆదాచేస్తుంది, తద్వారా ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, డీజిల్ ఇంధనంతో నడిచే రైళ్ల కారణంగా వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తద్వారా వార్షిక ఇంధన ఖర్చులలో ఆదా చేకూరుతుంది. ఇంతేకాకుండా పత్తి, మిరపకాయలు పప్పుధాన్యాలు మరియు మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ధరతో సరకు రవాణాను అందించడం వలన ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో లాభం చేకూరుతుంది.
ఇటీవలి కాలంలో రైలు అభివృద్ధి కార్యక్రమాలలో గతoలో ఏనాడూ లేనట్టి వృద్ధికి తెలంగాణ సాక్షిగా నిలిచింది. నేడు, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పెట్టుబడులు భారీగా పెరగడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణకు రైలు బడ్జెట్ కేటాయింపులో 2014-15 సంవత్సరంలో నున్న రూ 258 కోట్లతో పోలిస్తే గత 10 ఏళ్లలో దాదాపు 20 రెట్లు అనగా 2024-25 సంవత్సరానికి రూ 5,071 కోట్లకు పెంచండం జరిగింది. తత్ఫలితంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఎంతోగానో దోహదపడింది. రాష్ట్రంలో ఈ వృద్ధికి కీలకమైన అంశాలలో రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరణ ఒక భాగం. “మిషన్ ఎలక్ట్రిఫికేషన్”లో భాగంగా, తెలంగాణలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్(నిర్మాణంలో ఉన్నవి మినహాయిస్తే)విద్యుద్దీకరించబడింది. గత 10 సంవత్సరాలలో, రాష్ట్రవ్యాప్తంగా1,753 ట్రాక్ కిలోమీటర్ల రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరించబడింది.