
BJP: ఏపీలో బీజేపీ రెండు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని కీలక నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా 125 మందికి పైగా నేతలతో శివ ప్రకాష్ వరుసగా భేటీలు నిర్వహించి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ బలాబలాలపై సమీక్ష చేపట్టారు.
Read Also: Narendra Modi : రేపు ఎల్లుండి తెలంగాణలో మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇలా
బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారనే అంశంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలిసింది. పొత్తులపై తమ అభిప్రాయాలను శిన ప్రకాష్‌కు నేతలు చెప్పారు. అధిష్టానమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని శివ ప్రకాష్ వెల్లడించారు. రెండు రోజుల సమావేశం సారాంశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి శివ ప్రకాష్ నివేదించనున్నారు. వారం రోజుల్లోగా పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పొత్తులపై క్లారిటీ వస్తే రెండో విడత జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థుల పేర్లూ ఉండొచ్చని ఏపీ కమలనాధుల అంచనా.