
Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోడీ మరి కొద్ది సేపట్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఉదయం అదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన సభ అనంతరం నేరుగా చెన్నై వెళ్లారు. చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. అయితే, రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా నేటి రాత్రికి హైదరాబాద్ నగరంలోని రాజ్ భవన్ లో ప్రధాని బస చేయనున్నారు. ఇక, ప్రధాని మోడీ రాకతో బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీలో పాక్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్టు
ఇక, ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం వరకు రాజ్ భవన్ పరిసరాల్లో హై అలెర్ట్ తో పాటు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. అయితే, ప్రధాని మోడీ రాకతో మార్పులు చేశారు. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకోనున్నారు.