Leading News Portal in Telugu

Sunke Ravi Shankar : కాంగ్రెస్- బీజేపీ ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉంది



Sunke Ravi Shankar

తెలంగాణను గుజరాత్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత సుంకె రవిశంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ మోడల్ దేశానికీ ఆదర్శంగా ఉంది.. అనేక పథకాలను చూసేందుకు గుజరాత్ వాళ్ళు తెలంగాణకు వచ్చారన్నారు. గుజరాత్ మోడల్ అని రేవంత్ అనడం వెనుక కారణాలు ఏంటి..? ఆరెస్సెస్ మూలాల ఉన్నాయి కాబట్టే రేవంత్ అలా అన్నారని సుంకె రవి శంకర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉందని, పార్లమెంట్ సాక్షిగా మోడీ తెలంగాణ రోల్ మోడల్ అంటే రేవంత్ గుజరాత్ మోడల్ అంటున్నారన్నారు.

Multi-Starrer Movie: టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌.. అడివి శేషుతో దుల్కర్‌ సల్మాన్!

గుజరాత్ మోడల్ అంటే దేశాన్ని అమ్మడమే… దేశాన్ని కొల్లగొట్టిన వాళ్లంతా గుజరాతిలే… వాళ్లకు కాపలాగా ఉన్నది మోడీ అని, రేవంత్ కాంగ్రెస్ సీఎం గా ఉన్నారా? మోడీ కింద గుజరాతి గులాం గా మారినవా..? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ఆరెస్సెస్ భావాలు ఇంకా పోలేదన్నారు సుంకె రవి శంకర్‌. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పదేళ్లుగా ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చారని, అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని రెండు నెలలు గడవకు ముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే కాంగ్రెస్ ప్రాజెక్టులను అప్ప జెప్పేందుకు చూసిందని ఆయన ఆరోపించారు.

Missile Attack: ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు