Leading News Portal in Telugu

CM YS Jagan: ఈ నెల 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ వైఎస్సార్ జిల్లా పర్యటన



Jagan

CM YS Jagan: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు.

Read Also: Chandrababu: రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

8 వ తేదీ షెడ్యూల్‌
ఉదయం 8.20 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ ప్రారంభిస్తారు, తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు, అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభిస్తారు, అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు, అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు, తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.