
Supreme Court: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది, కాంగ్రెస్ నాయకుడిపై 2018 మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 2019 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్య అంటూ డీకే శివకుమార్ ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.
Read Also: Professor GN Saibaba: మావోయిస్టు లింక్ కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషిగా విడుదల
2017లో కాంగ్రెస్ నాయకుడు, ఆయన సహాయకులకు సంబంధించిన స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు జరిగింది. ఈ దాడుల్లో దాదాపు రూ.300 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నగదు బీజేపీతో ముడిపడి ఉందంటూ శివకుమార్ ఎదురుదాడి చేశారు. డీకే శివకుమార్ ఈ కేసులో 2019లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరారు. అక్కడ ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.