Leading News Portal in Telugu

AI Teacher : స్కూల్లోకి ఏఐ టీచరమ్మ వచ్చేసింది..



Ai Teacher

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదులుతూ వస్తున్నారు.. మొన్నటివరకు ఐటీ కంపెనీల వరకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేసింది..

ప్రస్తుతం ఈ ఏఐ టీచరమ్మ కేరళలో ప్రత్యేక్షమైంది.. తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్‌ని ప్రవేశ పెట్టింది.. కొచ్చికి చెందిన ఓ స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.. అక్కడ ఏఐ టెక్నాలజీ టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పర్యవేక్షించారు.. ఈ టీచర్ అచ్చమైన భారతీయ పంతులమ్మగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆమె సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు.. అర్థం కానీ వాటిని పదే పదే చెబుతూ,సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది.. మొత్తం మూడు భాషల్లో మాట్లాడ గల ఈ టీచరమ్మ నాలెడ్జ్‌ బేస్‌లో ఇతర ఆటోమేటెడ్‌ టీచింగ్‌ టూల్స్‌ కంటే అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉంది..

ఈ టెక్నాలజీ టీచరమ్మ ఆడ వాళ్లు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడుతుంది.. మామూలు మనుషులు ఎలాగైతే విద్యార్థులకు వివరంగా చెబుతారో అలాగే చాలా చక్కగా చెప్పడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఇక ఈ మేకర్స్‌ ల్యాబ్‌ సీఈవో హరిసాగర్‌ మాట్లాడుతూ..విద్యార్థులు తమ ల్యాబ్‌ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు.. అంతేకాదు ఇలాంటి ఆధునాతన టెక్నాలజీలో నైపుణ్యం సాధించారు కూడా అని తెలిపారు.. ఈ టీచర్ పాఠాలు అందరికీ అర్థమైనట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆయన అన్నారు.. మున్ముందు మరికొన్ని స్కూల్స్ లలో ఈ ఏఐ టీచర్స్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు చెప్పారు..