Leading News Portal in Telugu

KTR: రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్‌ షిండే..! ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు



Ktr Hot

ktr hot comments: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల (సిరిసిల్ల పట్టణ తెలంగాణ భవన్) లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీకి ఎంత గౌరవం ఇచ్చామో అందరికి తెలుసు.. మనకు ఏం చేయలేదనే 2021 నుంచి మన కేసీఆర్ తెలంగాణ వచ్చినపుడు వెళ్ళలేదన్నారు. భారత దేశంలో తెలంగాణ నంబర్ వన్ లాగా ఉండేది.. దేశంలోనే అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని అనుకరించేవాల్లు అని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ.. మోడీనీ బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు(బడే భాయ్ చోట భాయ్).. నాలుగు నెలల క్రితం గుజరాత్ ను కించపరిచిన రేవంత్ నిన్న మోడీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అని అన్నారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

Read Also: Gummanur Jayaram: టీడీపీ చేరిన మంత్రి జయరాం.. తొలి స్పందన ఇలా..

ఇక, వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే లాగా మారి బీజీపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ అని కేటీఆర్ అన్నారు. ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చాడు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లో వంద భాగాలు ఉన్నాయి.. మూడు బ్యారేజీలు ఉన్నాయి.. 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి.. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి.. వాటిని ఆపాలని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఎల్లుండి వస్తున్న రేవంత్ రెడ్డి వచ్చి సిరిసిల్ల డెవలప్మెంట్స్ ను చూసి పో.. నేత కార్మికుల గురించి కేకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పండి అన్నారు. వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నలను ఆదుకోండి.. సిగ్గు లేని లక్షణం రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Vande Bharat Trains: 4 వందేభారత్ ట్రైన్లపై రాళ్ల దాడి.. కర్ణాటక, ఏపీలో ఘటనలు..

అయితే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా.. ఉద్యోగాలు అన్ని కేసీఆర్ ఇచ్చినవే అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాల మీద పొంగు లాంటిదే.. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కు 50 వెయిళ మెజార్టీ తో గెలిపించాలి అని కోరారు. బండి సంజయ్ చేసిన గొప్పని ఏమన్న చేసిండా అంటే అమిత్ షా చెప్పులు మోయడంమేనా.. దేశ స్థాయిలో బండి సంజయ్ ఇజ్జత్ మొత్తం తిసిండు.. దేవుణ్ణి అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు బండి అని విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాకా ఉధ్యోగాలు ఇవ్వలేదు.. ఎల్లుండి సీఎం వస్తున్న రేవంత్ రెడ్డికి 3 డిమాండ్లను చేస్తున్నాను.. 1. నేత కార్మికులకు క్షమాపణ చెప్ప బతుకమ్మ చిరెల ఆర్డర్ ఇవ్వాలి.. 2. వర్కర్ టూ ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలి.. 3. మల్కపేట రిజర్వాయర్ పూర్తి అయ్యింది వెంటనే ప్రారంభించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.