Leading News Portal in Telugu

Chandrababu: బీసీలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్.. రూ.4 వేలకు పెంపు



Chandrababu

Chandrababu: బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తాం.. పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతాం అంటూ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంగళగిరి వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో.. జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌తో కలిసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు.. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోత వేసిన రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం.. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకోస్తాం.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం. బీసీ పారిశ్రామిక వేత్తల ప్రొత్సహానికి రూ. 10 వేల కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు.

Read Also: Telangana CM: ప్రధాన మంత్రిని పెద్దన్న అంటే తప్పేముంది

షరతుల్లేకుండా బీసీలకు విదేశీ విద్యను అమలు చేస్తాం అన్నారు చంద్రబాబు.. పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ పునరుద్దరిస్తామన్న ఆయన.. బీసీల కోసం రూ. 10 లక్షలతో చంద్రన్న కానుక తీసుకొస్తాం అన్నారు. పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం. ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం.. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం అన్నారు. బీసీ నాయకత్వంపై వైసీపీ గొడ్డలి వేటు వేసిందని విమర్శించారు చంద్రబాబు.. మంత్రిగా ఉండి.. ఎంపీ టిక్కెట్ వద్దని వైసీపీని వీడి మంత్రి గుమ్మనూరు వచ్చేశారు. గుమ్మనూరు ఏ తప్పు లేకుండానే సీటు మార్చారు.. తప్పు చేసిన వాళ్లని మార్చే దమ్ము ఉందా..? అని సవాల్‌ చేశారు. వైఎస్‌ జగన్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ గా అభివర్ణించారు చంద్రబాబు.. ఇక, జయహో బీసీ బహిరంగ సభ వేదికగా చంద్రబాబు ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..