నాట్య మయూరీ నితా.. మిసెస్ ముఖేష్ అబానీపై ప్రశంసల వర్షం | nita ambani classical dance mesmarise| new| angle| mukesh| wife| ipl| mumbay| owner| women
posted on Mar 5, 2024 8:36AM
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి.. దేశం మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. ఆ కుటుంబం ఈ వేడుకలను నభూతో అన్నట్లుగా నిర్వహిస్తోంది. సంప్రదాయం, ఆధునికతల మేలు కలయికగా అంబానీల ఇంట పెళ్లి వేడుక అందరినీ ఆకర్షిస్తోంది. అలరిస్తోంది.
ఇక ఆ ఇంట పెళ్లి సందడి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన పచ్చల హారంపై అయితే విస్తృత చర్చ ఎడతెగకుండా సాగుతూనే ఉంది. ఆ హారం విలువ రూ500 కోట్లకు పైమాటే అంటున్నారు. అదలా ఉంటే తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ షూట్ సందర్భంగా జామ్ నగర్ లో జరిగిన వేడుకలో నీతా అంబానీ చేసిన నాట్యం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
ముఖేష్ భార్యగా..ముంబై ఐపిల్ క్రికెట్ టీం యజమానురాలిగా, ఒక మహిళా వ్యాపారావేత్తగా మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ పరిచితురాలైన నీతా అంబానీ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ గా ఈ నాట్యంతో తనలోని మరో కళాకోణాన్ని ఆవిష్కరించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి లయబద్ధంగా ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ ఆ కార్యక్రమానికి హాజరైన అతిధులనే కాకుండా, సామాజిక మాధ్యమంద్వారా ఈ నృత్యాన్ని తిలకించిన అందరినీ మంత్రముగ్ధులను చేశారు.