Leading News Portal in Telugu

Harish Rao : కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైంది



Harish Rao

సీఎం రేవంత్ వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్ కు ఓటెయ్యండి అంటున్నారని, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..
కాషాయ పేపర్ పై మోడీ కి లవ్ లెటర్ రాసిండన్నారు. కాంగ్రెస్ ను కూడా మోసం చేసిండని, రాహుల్ అధానిని తిడితే సీఎం రేవంత్ అలై బలై తీసుకున్నారన్నారు. మళ్లీ మోడీయే ప్రధాని అవుతారు అన్నట్లుగా రేవంత్ మాట్లాడారని, రాహుల్ గాంధీయే ప్రధాని అవుతే మోడీ అవసరం ఏముంది నీకు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పిండని, రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమైనదని చెబుతున్నారన్నారు. ఆ గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారని, రాహుల్, సోనియా ఆశీర్వాదం కంటే మోడీ ఆశీర్వాదం కోసం ఎక్కువ ప్రయాస పడుతున్నారని హరీష్‌ రావు మండిపడ్డారు. వందరోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుందని, 2లక్షల రుణమాఫీ, 15వేల రైతు భరోసా, 24గంటల ఉచిత కరెంట్ ఇవ్వకుండా మాట తప్పారన్నారు.

అంతేకాకుండా..’వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఏవీ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎలా ఓటు అడుగుతుంది. ట్యాంకర్ లు పెట్టీ పొలాలకు నీళ్లు పాటించే దుస్థితి వచ్చింది. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ పాలన కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు, రైతులు, రైతు కూలీలు నిర్ణయం తీసుకోవాలి. 4వేల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసిన పాలనకు గుణపాఠం చెప్పాలి.. 4వేల పెన్షన్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ పై కేసు పెట్టాలి. ఎల్ ఆర్ ఎస్ ఫ్రీ గా చేస్తామని చెప్పి మాట తప్పినందుకు ఓటు వేయాలా? దళిత బంధు ఇవ్వనందుకు దళితులు నిర్ణయం తీసుకోవాలి. మా ఎంపీ లను బీజేపీ గుంజుకుంది. ఏమి సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నాయకులు మురళి దర్ రావు, మాధవి లత లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి ని మెచ్చు కుంటున్నారు. మా ఎంపీలను బీజేపీ గుంజుగుంటుంటే మాకు బీజేపీతో పొత్తు ఎక్కడిది. కర్ణాటక బీజేపీ, మన రాష్ట్ర బీజేపీ నాయకులు రేవంత్ ను మెచ్చుకుంటున్నారు. మేము నోటిఫికేషన్స్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లు ఎన్ని? రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట నిలుపుకోవాలి.. ఇప్పటి వరకు జాబ్ క్యాలండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను ఎలా ఓట్లు అడుగుతారు.. ఉపాధి హామీ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదు. వృద్దులకు ఒక నెల పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీ యాంబర్స్ మెంట్ ఇవ్వలేదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారు. మా మీద కక్షతో ప్రాజెక్ట్ కు, రైతులకు నష్టం చేయొద్దు’ అని హరీష్‌ రావు అన్నారు.