Leading News Portal in Telugu

IND Vs ENG 5th Test: ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు..



Eng

Dharamshala Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ ( England ) క్రికెట్‌ టీమ్ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక, సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్‌ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ చిల్ అవుతున్నారు. ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్‌ అవుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social Media) లో వైరల్ అవుతున్నాయి.

Read Also: Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!

ఇక, ఇంగ్లీష్‌ ఆటగాళ్లు సిరీస్‌ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా నచ్చినట్లుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ ( Himachal Pradesh ) శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్‌ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కూడా పెట్టింది పేరు.. అయితే, ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగించినట్లుంది.

Read Also: MP Margani Bharat: బైక్స్పై రాజమండ్రి నుంచి అయోధ్యకు యువకులు.. ఆల్ దీ బెస్ట్ చెప్పిన ఎంపీ

అయితే, ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్ పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహర్చింది. బజ్‌బాల్‌ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్‌ ( Rohit Sharma) సేన దెబ్బకు తోకముడిచారు. బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, రూట్‌ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు ఏమీ లేవు.. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత (Team India ) క్రికెట్‌ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు.