Leading News Portal in Telugu

Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, ధర?



Real Me (2)

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. రియల్‌మి 12 ప్లస్ 5జీ సిరీస్ వచ్చేసింది. బడ్జెట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఒకటి.. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్, ధర ఏంటో ఒక్కసారి చూసేద్దాం..

ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. రియల్‌మి 12 ప్లస్ 5జీ ఫోన్ 2.6జీహెచ్‌జెడ్ వద్ద ఆర్మ్ కార్టెక్స్-ఎ78 కోర్లు, 2.0జీహెచ్‌జెడ్ వద్ద ఆర్మ్ కార్టెక్స్-ఎ55 కోర్లతో పాటుగా ఆక్టా-కోర్ సీపీయూ కాన్ఫిగరేషన్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. ఆర్మ్ మాలి-జీ68 జీపీయూని ఉపయోగిస్తుంది. 6ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీపై పనిచేస్తుంది. 26ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది.. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో ఆధారితంగా పనిచేస్తుంది.. ఇక ఈ ఫోన్ బరువు 190 గ్రాములు ఉంటుంది..

రియల్‌మి 12 5జీ ఫోన్ 108ఎంపీ 3ఎక్స్ జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది. వినియోగదారులు హై-క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫోన్ హైకలర్ డిస్‌ప్లే టెక్నాలజీతో కూడిన భారీ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్డీ ప్లస్ సన్‌లైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఇంకా ఈ రెండు ఫోన్లు దగ్గర ఫీచర్స్ ను కలిగి ఉంటాయని తెలుస్తుంది..

ఇక ధర విషయానిస్తే.. రియల్‌మి 12 ప్లస్ ధరలు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్‌కి రూ. 20,999, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌కి రూ. 21,999గా కంపెనీ నిర్ణయించింది.. అలాగే రియల్‌మి 12 ఫోన్ మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ. 16,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ. 17,999 నుంచి అందుబాటులో ఉంటుంది.. అలాగే ఈ ఫోన్ల పై తగ్గింపు కూడా ఉందని తెలుస్తుంది..