Leading News Portal in Telugu

Chit Fund Scam: చిట్టీల పేరుతో చీటింగ్.. తూప్రాన్‌లో ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో ట్విస్ట్



Chit Fund Scam

Chit Fund Scam: మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ కుటుంబం కనిపించకుండా పోయింది. ఇందులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. తూప్రాన్‌కు చెందిన బిజిలిపురం యాదగిరి(37) తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం పెద్దగుట్టకు వెళ్తున్నామని చెప్పి వెళ్లాడు. అయితే, మంగళవారం సాయంత్రం వరకు తిరిగిరాలేదు. ఫోన్ ​చేస్తే స్విచ్ఛాఫ్​ వచ్చింది. కుటుంబ సభ్యులు పెద్దగుట్టకు వెళ్లి వెతికినా ఆచూకీ దొరకలేదు. యాదగిరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో నేటి‌ నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇదిలా ఉండగా.. తూప్రాన్‌లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్‌ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యాదగిరిపై ఫిర్యాదు చేసేందుకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు బాధితుల క్యూ కట్టారు. సుమారు 70 మంది బాధితులు యాదగిరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.