మేడారం జాతర హుండీ కానుకల ఆదాయం కొత్త రికార్డు | medaram jatara hundi income| new| record| sammakka| sarakka| foru| days| gold
posted on Mar 7, 2024 4:07PM
తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన సమ్మక్క సారక్క జాతరలో హుండీ కానుకల ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ జరిగిన ఈ మహాజాతరకు కోటీ 40లక్సలకు మందిపైగా భక్తులు వనదేవతలను సందర్శించుకున్నారు. భక్తుల సంఖ్య కూడా ఈ ఏడాది కొత్త రికార్టు సృష్టించిందని అధికారులు తెలిపారు.
ఇక హుండీ కానుకల ఆదాయం విషయానికి వస్తే ఈ ఏడాది జాతరలో హుండీ కానులకల ఆదాయం 13 కోట్ల పాతిక లక్షల 22 వేల 551 రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. జాతర సందదర్భంగా 540 హుండీలు ఏర్పాటు చేశారు. ఆ హుండీలలో భక్తుల వేసిన కానుకల లెక్కింపు బుధవారం (మార్చి 6) ముగిసింది. ధర్మాదాయ, రెవెన్యూ, సమ్మక్క సారక్క జాతర ట్రస్టు బోర్డు సభ్యుల సమక్షంలో సీసీ కెమేరాల నిఘాలో హుండీ కానుకల లెక్కింపు జరిగింది.
గత జాతర సందర్భంగా హుండీ కానుకల ఆదాయం 11 కోట్ల 64లక్షల రూపాయల ఆదాయం రాగా, ఆ సారి అది భారీగా పెరిగింది. అసలు 13 కోట్ల పాతిక లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం జాతర చరిత్రలోనే రికార్డు అని అధికారులు తెలిపారు. ఈ హుండీ కానుకల ఆదాయాన్ని 1, 3 నిష్పత్తిలో పూజారులు దేవాదాయ శాఖకు జమ అవుతాయి. ఈ కానుకలలో బంగారం, వెండి కూడా ఉన్నాయి.