Leading News Portal in Telugu

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ సీఎం కుమార్తె



Bjk

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. తాజాగా కేరళలో మహిళా కాంగ్రెస్ నేత కమలం గూటికి చేరారు.

కాంగ్రెస్‌ దివంగత నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. పద్మజ ఫేస్‌బుక్ ఖాతాలో పార్టీకి సంబంధించిన పోస్ట్‌లను తొలగించడంతో ఆమె పార్టీ మారనున్నట్లు పలువురు ముందుగానే భావించారు.

అధిష్టానం తనను పక్కన పెట్టడంతో పద్మజ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పద్మజ బీజేపీలో చేరినట్లు సమాచారం.

ఇటీవలే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అలాగే మాజీ ప్రధాని మనవడు కూడా కమలం పార్టీలో చేరారు. ఇక గుజరాత్ కాంగ్రెస్‌లో కూడా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.