Leading News Portal in Telugu

Vijayawada Crime: బెజవాడ సబ్ జైలు ఖైదీ అనుమానాస్పద మృతి



Keerthi Sagar Death

Vijayawada Crime: బెజవాడ సబ్ జైలు ఖైదీ అనుమానాస్పద మృతి చెందాడు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తిలక్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఆ తర్వాత విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు.. అయితే, ఈ రోజు ఉదయం జైలులో కదలకుండా ఉన్నాడని తోటి ఖైదీలు.. జైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో సీపీఆర్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తిలక్‌ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలతోనే తిలక్‌ మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తు్నారు.. తిలక్ స్వస్థలం నూజివీడుగా గుర్తించారు. మరోవైపు తిలక్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.. కాగా, గతంలోనూ కొందరు ఖైదీలు జైళ్లలో మృతిచెందిన ఘటనలు ఉన్నాయి.. వీటిపై జైళ్లశాఖ అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కొన్ని ఘటనలపై విచారణ కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు.

Read Also: Good News to Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..