
Congress 1st list: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే 195 ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 10 రాష్ట్రాల్లోని కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసిటట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోక్‌సభ జాబితా 39 మంది అభ్యర్థులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్ వంటి దిగ్గజ నేతలు ఉంటారని సమాచారం.
Read Also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త వీడియో.. ప్రజల సాయం కోరిన ఎన్ఐఏ..
మరోసారి రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తొలిజాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేట్ రాజ్‌నంద్ గావ్ నుంచి, కేరళ తిరువనంతపురం నుంచి శశిథరూర్ అలప్పుజా నుంచి కేసీ వేణుగోపాల్ పోటీలో ఉండనున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం మరియు లక్షద్వీప్‌ల అభ్యర్థులు ఉండవచ్చు. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై చర్చ నడుస్తుండటంతో మహారాష్ట్ర, బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలను కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనను హోల్డ్‌లో పెట్టింది. ఇక యూపీలో ఇప్పటికే అఖిలేష్ యాదవ్‌తో పొత్తు ఖరారైంది.
రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా ఇక్కడి నాయకత్వం కోరినప్పటికీ మరోసారి వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీపీఎం కూడా ఈ సీటుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ తమకు ఈ సీటు వదిలేయాలని కాంగ్రెస్‌ని కోరుతోంది. కాంగ్రెస్‌కి చెందిన 11 మంది మాజీ సీఎంలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.