Leading News Portal in Telugu

Samantha: ఆ గాయం కంటే ఈ గాయం పెద్దది!



Samantha Ruthprabhu

Samantha Comments on Depression Goes Viral: మయో సైటిస్ కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకున్న సమంత సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కలకలం రేపుతున్న క్రమంలో ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మన మీద మనకున్న నమ్మకం చాలా గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది ఇక నా 13 ఏళ్ల సినిమా కెరియర్లో చాలా అభద్రతాభావానికి గురవుతున్నానని తెలుసుకోగలిగి త్వరలోనే దాని నుంచి బయటకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవాలని ఎక్కువ సమయం పడుతుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు

ఇక సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టు సైన్ చేయలేదు. చివరిగా శాకుంతలము, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె సిటాడెల్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు మినహా ఆమె ఏ ఒక్క ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక సినిమాలకి గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించిన ఆమె ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన సినిమాల నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు. సోషల్ మీడియాలో సమంత హాట్ షో చూసిన వారంతా ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సమంత కూడా ఎక్కడ తగ్గకుండా హాట్ షో చేస్తోంది.