Leading News Portal in Telugu

Earthquake: ఫిలిప్పీన్స్‌, అండమాన్ సముద్రంలో భూకంపం



Earthquke

ఫిలిప్పీన్స్‌లోని (Philippines) మిండానావో, అండమాన్ సముద్రం (Andaman sea)లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 140 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఇక అండమాన్ సముద్రంలో కూడా 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప సంఘటన మార్చి 8, 2024న 13:07:41 దగ్గర సంభవించినట్లుగా పేర్కొంది. 140 కి.మీ దిగువన ఈ భూకంపం సంభవించినట్లుగా తెలిపింది.

హిందూ మహాసముద్రం యొక్క ఈశాన్య భాగంలో ఉన్న అండమాన్ సముద్రం.. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల తరచుగా ఈ భూప్రకంపనలకు లోనవుతోంది.

ఇదిలా ఉంటే భూకంపం తర్వాత సముద్రపు అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అండమాన్ సముద్ర ప్రాంతంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక ఫిలిప్పీన్స్‌లోని (Philippines) మిండానావోలో 08-03-2024న 14:41:47 నిమిషాలకు భూకంపం సంభవించింది. ప్రస్తుతం దీని తీవ్రత 6.0గా నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.